నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కల్కి  2898 ఏడీ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో దీపిక పదుకునే హీరోయిన్ గా నటించగా దిశా పటాని అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటీనటులు సైతం  ఈ మూవీలో పలు ఇంపార్టెంట్ రోల్స్ లో ప్రేక్షకులకు కనిపించనున్నారు. అంతేకాకుండా  లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

 ఇక ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో కమల్ హాసన్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే దానిపై ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. ఆయన ఇంతకుముందు ఎప్పుడు నటించని పాత్రలో కమల్ హాసన్ ఈ సినిమా ద్వారా కనిపించబోతున్నారు దానితో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు 200 కు పైగా సినిమాలలో నటించిన ఆయన తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ వంటి భాషల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన మాతృభాష తమిళ్ అయినప్పటికీ

 కూడా మిగతా భాషలలో కూడా ప్రావీణ్యం ఉన్న ఆయన అద్భుతమైన డైలాగ్ లను చెప్పగలరు.  నటించడమే కాకుండా ఆయన అన్ని భాషలను సైతం నేర్చుకున్నారు. ఇక ఈ విషయాన్ని కల్కి 2898 ఏడి సినిమా ద్వారా మరో నిరూపించుకున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా పలు భారతీయ భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. దాంతో కమల్ హాసన్ తను నటించిన పాత్రకి తానే స్వయంగా అన్ని భాషలలో డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ లో కమలహాసన్ ఒక డైలాగ్ చెప్తారు. అయితే అభిమానులు ఆ డైలాగ్ ను అన్ని భాషల్లో పెట్టి ఒక వీడియోని తయారు చేసి.. కమల్ హాసన్ పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు ప్రేక్షకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: