ప్రస్తుతం మూవీ లవర్స్‌ దృష్టి అంతా కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న కల్కి 2898 ఏడీ పైనే ఉంది. యంగ్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీని వైజయంతీ మూవీస్‌ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంకా హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్‌ టీం ప్రమోషన్స్‌లో  బాగా బిజీగా ఉంది.సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌ మేనియా షురూ అయింది.ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బుకింగ్స్‌ చాలా గ్రాండ్‌గా షురూ అయ్యాయి. ఈ సినిమా మిడ్‌ వీక్‌లో విడుదలవుతున్నప్పటికీ..  కల్కి 2898 ఏడీ బుకింగ్స్ మొదలుపెట్టిన కొన్ని గంటలకే  నేషనల్‌ బెల్ట్‌లో హిందీ వెర్షన్ టిక్కెట్స్‌ సుమారు 13 వేలకుపైగా అమ్ముడవ్వడం జరిగింది. 


ఇక కల్కి 2898 ఏడీ అడ్వాన్స్ సేల్స్‌ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఏకంగా రూ.50 కోట్లు దాటింది. పాన్ ఇండియా స్టార్ గా మారాక ప్రభాస్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో పెరిగిపోయిందో చెప్పడానికి ఈ ఒక్క ఫిగర్‌ చాలంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.ఈ మూవీలో ప్రభాస్ భైరవగా ఇంకా కల్కి గా నటించబోతున్నాడు. ఇక అతని దోస్త్‌ బుజ్జి  పాత్రలో స్పెషల్ కారు కనిపించనుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీలు అయిన దీపికా పదుకొనే, దిశా పటానీ ఈ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా… బెంగాలీ నటుడు అయిన శాశ్వత ఛటర్జీ విలన్‌గా కనిపించబోతున్నాడు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌ ఇంకా అలాగే పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నార్త్ ఇండియాలో కల్కి క్రేజ్ చూస్తుంటే ఖచ్చితంగా బాహుబలి రికార్డ్స్ ని ఈజీగా బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా విడుదల అయ్యాక ఎంత పెద్ద హిట్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: