తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటిమనులలో నివేత పేతురాజ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే చాలా సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఈ నటి టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి విశ్వక్ సేన్ తో కూడా కొన్ని సినిమాలలో నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటగా పాగల్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడమ విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది.

ఈ సినిమాలోని వీరిద్దరి జంటకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత వేరే కాంబోలో దాస్కా దమ్కి అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో విశ్వక్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం "భూ" అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ లో విశ్వక్ మరియు నివేత పెతురాజ్ ఇద్దరు కూడా ఉన్నారు.

కాకపోతే వీరిద్దరి కాంబినేషన్లో సన్నివేశాలు ఏమీ ఉండవు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నివేత పాల్గొంది. అందులో భాగంగా ఈమెకు మీరు విశ్వక్ కలిసి మూడు సినిమాలలో నటించారు. ఆ విషయంలో ఎలా ఫీలవుతున్నారు అనే ప్రశ్న ఎదురయింది. దానికి బ్యూటీ సమాధానం ఇస్తూ ... మేమిద్దరం కలిసి మూడు సినిమాలలో నటించామా. "భూ" సినిమాలో విశ్వక్ ఉన్నాడన్న విషయం కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు అని స్పందించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. "భూ" సినిమా పెద్దగా పబ్లిసిటీ లేకుండా ఓ టీ టీ లోకి రావడంతో ఈ సినిమాకు పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

np