తమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో విజయ్ సేతుపతి ఒకరు . ఈయన కేవలం తమిళ సినిమాలలో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాలలో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు . ఇక పోతే తాజాగా విజయ్ సేతుపతి "మహారాజా" అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ జూన్ 14 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయింది . ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది . ఈ 10 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసు కుందాం.

10 రోజుల్లో ఈ సినిమాకి నైజాం ఏరియాలో 2.65 కోట్లు కలెక్షన్లు దక్కగా, సీడెడ్ లో 85 లక్షలు , ఆంధ్ర లో 1.93 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 10 రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 5.43 కోట్ల షేర్ , 10.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని ఇప్పటికే 1.96 కోట్ల లాభాలను అందుకుంది. ఇక ఈ మూవీలోని విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs