తమిళ సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు అద్భుతమైన జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో లేడీ సూపర్ స్టార్ నయన తార, మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి త్రిష కూడా ఉన్నారు. వీరు చాలా సంవత్సరాలుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. విరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అనేక మంది హీరోయిన్లు కోలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. వారిలో కొంతమంది మొదట కొన్ని విజయాలను సాధించడం తోటే వీరు అదిరిపోయే స్థాయికి వెళ్లి నయనతార , త్రిష స్థాయికి అందుకుంటారు అని అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో నయనతార , త్రిష స్థాయికి మాత్రం ఎవరూ చేరుకోలేదు.

ఇక ఇప్పటికి కూడా ఈ ఇండస్ట్రీలో వీరిద్దరూ ఫుల్ జోష్ ఉన్న హీరోయిన్లుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వీరు నటిస్తున్న సినిమాలకు కూడా జనాలు భారీ ఎత్తున వస్తూ ఉండడంతో వీరికి కోలీవుడ్ నిర్మాతలు కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి తమ సినిమాలలో పెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. దానితో విరు ఇప్పటికీ కూడా తమిళ సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరూ దాదాపుగా ఒక్కో సినిమాకు 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు , ఒక వేళ సినిమా మరియు అందులోని వీరి పాత్ర నచ్చినట్లు అయితే కొంత తక్కువ పారితోషకానికి చేయడానికి , అలాగే దర్శకులు , నిర్మాతలను బట్టి కాస్త తక్కువ రెమ్యూనరేషన్ కి మూవీస్ చేయడానికి వీరు ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఎన్నో సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్లుగా కెరీర్ను కొనసాగిస్తూ ఇప్పటికి కూడా మంచి విజయాలను అందుకుంటున్న వీరు మరికొన్ని సంవత్సరాలు కూడా ఈ ఇండస్ట్రీలో అద్భుతమైన జోష్ ఉన్న హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: