తెలుగులో మంచి క్రేజ్ కలిగిన నటీమణులలో రెజీనా ఒకరు. ఈ ముద్దుగుమ్మ "ఎస్ ఎం ఎస్" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం, ఇందులో ఈమె తన నటనతో, అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస అవకాశాలు దక్కాయి. దానితో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ రావడంతో ఈమె క్రేజ్ చాలా వరకు తగ్గింది. దానితో ఈమె స్టార్ హీరోయిన్ స్థాయి వరకు వెళ్లలేక పోయింది.

స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లలేకపోయినా ఈమె ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న మంచి జోష్ లోనే కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే టాలీవుడ్ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు సన్నీ.డియోల్ హీరోగా ఓ మూవీ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రెజీనా హీరోయిన్గా కనిపించబోతుంది. గోపీచంద్ , సన్ని తో అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.

వీర సింహా రెడ్డి మూవీ తో మంచి జోష్ లో ఉన్న గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడం , గథర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సన్నీ హీరోగా రూపొందబోయే సినిమా కావడంతో ఈ మూవీ పై ఇటు తెలుగు, అటు హిందీ సినీ పరిశ్రమలలో మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. ఈ మూవీ కనుక సూపర్ సక్సెస్ అయినట్లు అయితే ఇందులో హీరోయిన్ గా కనిపించబోయే రెజీనాకు కూడా అద్భుతమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ మూవీ విజయం సాధిస్తే ఈమెకు అదిరిపోయే రేంజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కే ఛాన్స్ చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: