తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో కృతి శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఉప్పెన అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా విడుదల కాకముందే ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటల ద్వారానే ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సినిమా విడుదల కావడం, అది బ్లాక్ బాస్టర్ కావడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది. దానితో వెను వెంటనే ఈమెకు టాలీవుడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఆ తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలు వరుసగా విజయాలను అందుకున్నాయి.

దానితో ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే హైట్రీక్ విజయాలను అందుకోవడంతో తెలుగులో లక్కీ బ్యూటీగా మారింది. ఆ తరువాత ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలలో వరసగా అవకాశాలు దక్కాయి. కానీ బంగార్రాజు మూవీ తర్వాత ఈమె నటించిన ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. పరుసగా ఈ బ్యూటీ నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి నీకు చెప్పాలి, కస్టడీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

దానితో ఈమెకి తెలుగులో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తాజాగా ఈ బ్యూటీ మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కనుక హిట్ కాకపోతే ఈమెకు తెలుగులో అవకాశాలు రావడం కష్టమే అని చాలామంది అనుకున్నారు. కాకపోతే మనమే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. మరి బంగార్రాజు సినిమా తర్వాత ఈ బ్యూటీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మనమే తో మంచి విజయం దక్కింది. మరి ఈమెకు మళ్లీ అవకాశాలు వరుసగా వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks