పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అవ్వడం వల్ల సినిమాలకు అంత ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పైకే పవన్సినిమలు 3 సెట్స్ మీద ఉన్నాయి. అవి ఎప్పుడు పూరవుతాయి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది ఎవర్కి అర్ధం కావట్లేదు. పవన్ డేట్స్ ఇచ్చినప్పుడే సినిమాలు పూర్తి చేయాలని నిర్మాతలు కూడా కన్విన్స్ అయిపోయారు. ఏపీలో డిప్యూటీ సీఎం గా ప్రజలు ఇచ్చిన ఈ బాధ్యతని పవన్ సమర్ధవంతంగా చేయాలని అనుకుంటున్నారు.

ఐతే సెట్స్ మీద ఉన్న సినిమాల్లో సుజిత్ తో చేస్తున్న ఓజీ, ఏ.ఎం రత్నం ప్రొడక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఈ రెండు ముందు పూర్తి చేయాల్సి ఉంది. మైత్రి మూవీ ప్రొడక్షన్ లో హరీష్ శంకర్ దర్శకత్వం తో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఇంకా లేట్ పట్టేలా ఉంది. పవన్ తో సినిమా ఎలాగు ఇప్పుడప్పుడే పూర్తి కాదు అని హరీష్ శంకర్ రవితేజతో సినిమా చేస్తున్నాడు.

మిస్టర్ బచ్చన్ సినిమా దాదాపు పూర్తి కావొస్తుంది. ఇక మరోపక్క హరీష్ శంకర్ నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు రెడీ అవుతున్నారు. పవన్ సినిమా చేశాక ఈ మూవీ చేస్తాడా లేదా పవన్ సినిమా ఎలాగు పూర్తి చేయడం కష్టమని చిరుతో వెళ్తాడా తెలియదు కానీ పవన్ సినిమా పనుల కన్నా తర్వాత సినిమాల విషయం లో హరీష్ శంకర్ ప్లానింగ్ లో ఉన్నాడు. మరి పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూర్తి చేస్తే ఆ సినిమా చూడాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మెగా ఫ్యాన్ అయిన హరీష్ శంకర్ వరుస మెగా సినిమాలు చేయడం ఫ్యాన్స్ ని కూడా సర్ ప్రైజ్ చేస్తుంది. మరి చిరుతో హరీష్ శంకర్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: