సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల విషయంలో కాస్త టైం తీసుకుంటుంది. ఐతే అమ్మడు సౌత్ సినిమాల కన్నా కూడా బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టిన సమంత లేటెస్ట్ గా ఒక సినిమాకు కూడా సైన్ చేసిందని టాక్. సమంత ఈసారి ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి షారుఖ్ తో ఒక సినిమా చేస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో సమంతని హీరోయిన్ గా లాక్ చేశారని తెలుస్తుంది. సమంత కూడా షారుఖ్ ఆఫర్ అనగానే సూపర్ ఎగ్జైట్ అయ్యినట్టు టాక్. సౌత్ సినిమాల నుంచి ఆఫర్లు వస్తున్నా కెరీర్ ఇక మీదట హిందీలో రాణించాలని అనుకుంటుంది సమంత.

అందుకే తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఆఫర్ వచ్చినా కూడా కాదని బాలీవుడ్ ఆఫర్లను ఓకే చేస్తుంది. షారుఖ్ లాంటి స్టార్ సినిమాలో నటిస్తే మాత్రం సమంతకు బాలీవుడ్ లో కూడా పక్కా రేంజ్ పెరుగుతుంది. ఇన్నాళ్లు సౌత్ సినిమాలతోనే అలరించిన అమ్మడు ఇక మీదట హిందీలో అలరించాలని చూస్తుంది. తప్పకుండా సమంతకు ఈ ఆఫర్ మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. సమంత ఏం చేసినా సరే ఫ్యాన్స్ అంతా కూడా ఆమెను సపోర్ట్ చేస్తుంటారు. మరి సమంత షారుఖ్ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం సమంత తన సొంత బ్యానర్ లో తనే నిర్మాతగా మారి మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది. ఆ సినిమా ను ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఆఫర్ అమ్మడిలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చినట్టు అరధమవుతుంది. సమంత బాలీవుడ్ ఫుల్ లెంగ్త్ సినిమాలు చేస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు.
 


 

మరింత సమాచారం తెలుసుకోండి: