ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్, దీపిక, దిశా పటాని ఇలా హేమాహేమీలు అందరు నటించారు. ఈ సినిమా ప్రమోషనల్ వీడియోస్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు. ఇక ఈ సినిమా టికెట్స్ ఇలా ఓపెన్ అయ్యాయో లేదో అలా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఐతే కల్కి సినిమా సెట్స్ లో కమల్ హాసన్ కు నచ్చిన అంశం గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమాను పేపర్ మీద పెట్టినట్టుగా స్క్రీన్ మీదకు తెస్తారా అన్న డౌట్ తనకు ఉందని అన్న కమల్ అమితాబ్ సార్ సీన్స్ చూశాక నమ్మకం కుదిరిందని అన్నారు. అంతేకాదు సెట్స్ లో తనకు బాగా నచ్చిన ఇంకో అంశం ఏంటంటే సినిమా షూటింగ్ అంతా చాలా సైలెంట్ గా డిసిప్లేండ్ గా జరిగింది. అనవసరమైన హడావిడి లేకుండా ఈ సినిమా షూటింగ్ చేశారు.

ఈ విషయంపై కమల్ చెప్పడం వైజయంతి మూవీస్ బ్యానర్ సినిమా ఎంత డిసిప్లేండ్ గా తీస్తున్నారో అర్ధమవుతుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా వైజయంతి బ్యానర్ ఆర్టిస్టులకు ఎంత కంఫర్టబుల్ గా చూస్తుందో చెప్పాడు. ఇప్పుడు కమల్ కూడా అదే విషయాన్ని చెప్పారు. కల్కి సినిమాలో కమల్ రోల్ వెరైటీగా ఉండబోతుంది. సినిమా తనకు కూడా ఒక మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందని అన్నారు కమల్. ఇక కల్కి సినిమా టికెట్స్ ఒక రేంజ్ లో బుక్ అవుతుండగా సినిమా ఫస్ట్ డే రికార్డ్ వసూళ్లను రాబడుతుందని ఫిక్స్ అయ్యారు. మరి అది ఏ రేంజ్ లో ఉండబోతాయన్నది చూడాలి. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా చూపిస్తాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: