ఉప్పెన సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి ఆ సినిమాలో బేబమ్మ పాత్రతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది. తొలి సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరి వావ్ అనిపించిన అమ్మడు ఆ తర్వాత దాదాపు ఏడు ఎనిమిది సినిమాల దాకా చేసింది. కానీ ఆ సినిమాలేవి అమ్మడికి లక్ తీసుకు రాలేదు. పైగా అమ్మడికి వరుస ఫ్లాపుల వల్ల ఆమెకు ఉప్పెనతో వచ్చిన పాపులారిటీ కూడా తగ్గిపోయింది.

ఈమధ్యనే కృతి శెట్టి మనమే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాతో కమర్షియల్ గా ఓకే అనిపించుకున్నా కృతికి పెద్దగా కలిసి రాలేదు. తెలుగులో మనమే తర్వాత మరో ఛాన్స్ కూడా లేదు. అందుకే కృతి శెట్టి తన పూర్తి ఫోకస్ తమిళ పరిశ్రమ మీద పెట్టాలని అనుకుంటుంది. ఆల్రెడీ అమ్మడు అక్కడ రెండు సినిమాల్లో నటిస్తుంది. ఆ రెండు కూడా సెట్స్ మీద ఉన్నాయి.

తెలుగులో ఎలాగు పెద్దగా ఛాన్సులు లేవని భావిస్తున్న అమ్మడు కెరీర్ అంతా కూడా అగమ్యగోచరంగా మారింది. అందుకే కోలీవుడ్ మీద దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యింది. అదీగాక అమ్మడు మలయాళంలో కూడా ఒక సినిమా చేస్తుంది కాబట్టి ఆమె అక్కడ అవకాశాలు వచ్చినా సరే చేయాలని అనుకుంటుంది. మొత్తంగా కృతి శెట్టి తొలి సిన్మా రిలీజ్ అయిన టైం లో పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకోగా అమ్మడు మాత్రం ఇలా వచ్చి అలా వెళ్లినట్టుగా కెరీర్ మారిపోయింది. ఐతే తమిళంలో అయినా కూడా అమ్మడికి సరైన లక్ కలిసి వస్తుందేమో చూడాలి. కచ్చితంగ కృతి తమిళంలో అయినా వరుస సక్సెస్ లు అందుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి అమ్మడిక్ అక్కడ లక్ ఎలా ఉందో చూడాలి. అక్కడ స్టార్ తో నటిస్తే మాత్రం అమ్మడికి మరింత కలిసి వస్తుందని చెప్పొచ్చు.    


మరింత సమాచారం తెలుసుకోండి: