ప్రభాస్ కల్కి మరో రెండు రోజుల్లో రాబోతుంది. సినిమాకు తెలంగాణాలో బుకింగ్స్ ఇలా ఓపెన్ చేయగానే హాటు కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఐతే కల్కి సినిమా హంగామా చూస్తే సినిమా కచ్చితంగా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లనే రాబట్టేలా ఉందని అంటున్నారు. ఇక బాగా ట్రై చేస్తే మాత్రం సినిమా బాహుబలి రికార్డులను కూడా దాటే అవకాశం ఉందని అంటున్నారు.

బాహుబలి సినిమా మొదటి రెండు పార్టులు కలిపి 2000 మార్క్ రీచ్ అయ్యింది. ఐతే కల్కి ఆ ఛాన్స్ ఉందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. ఐతే కల్కి 1000 కోట్ల మార్క్ మాత్రం రీచ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. సలార్ సినిమాతోనే దాదాపు 600 కోట్ల దాకా రీచ్ అయ్యాడు ప్రభాస్.

ఇక కల్కి మీద ఉన్న అంచనాలు సినిమా విజువల్స్ అన్నీ ప్రాజెక్ట్ పై భారీ హైప్ తెచ్చాయి. కచ్చితంగా ఈ సినిమా అనుకున్న అంచనాలను రీచ్ అయితే మాత్రం రికార్డ్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. సినిమాలో ప్రతి స్టార్ ఇన్వాల్వ్ అయ్యి మరీ చేసినట్టు అనిపిస్తుంది. మరి ఈ సినిమా బాహుబలిని క్రాస్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది మరోసారి చూసేలా ఈ మూవీ రికార్డులను తిరగ రాస్తుందని రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి కల్కి భవితవ్యం ఏంటన్నది మరో రెండు రొజుల్లో అర్ధమవుతుంది. కల్కి తో నాగ్ అశ్విన్ పేరు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో మారుమోగుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాకు సంతొష్ నారాయణన్ మ్యూజిక్ సినిమాకు మరింత హైప్ తెచ్చేలా చేసింది. మరి కల్కి ప్రభావం ఎంత అన్నది చూడాలని ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా కల్కి హంగామా ఒక రేంజ్ లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: