- ముంబైలో రు. 2 వేలు.. హైద‌రాబాద్ ఫ‌స్ట్ షోకు బ్లాక్ లో రు. 3 వేలు
- బెంగ‌ళూరులో రు. 1100 - రు. 1400

( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి సినిమా మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా నే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌ల్కి మానియా.. ప్ర‌భాస్ రాజు మ్యాజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెష‌ల్ షో ప్లానింగ్ న‌డుస్తోంది. తెలంగాణ‌లో తొలి రోజు అన్ని థియేట‌ర్ల‌లో 6 షోలు వేసుకునే అనుమ‌తులు వ‌చ్చేశాయి. అక్క‌డ టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చేసింది. అక్క‌డ మ‌ల్టీ ఫ్లెక్స్‌ల‌లో రు. 100, సింగిల్ స్క్రీన్ల‌లో రు. 75 ఏ టిక్కెట్ పై అయినా పెంచుకునే వెసులు బాటు ఉంది.


ఇక పెరిగిన రేట్ల ప్ర‌కారం చూస్తే ఏఎంబీ మాల్‌లో అయితే ల‌గ్జ‌రీ టిక్కెట్ రేటు రు. 500 ఉంటే.. మిగిలిన మ‌ల్టీఫ్లెక్స్ ల‌లో కూడా రు. 430 నుంచి రు. 470 వ‌ర‌కు ఉంది. అయితే హైద‌రాబాద్‌లో ఉద‌యం 5 గంట‌ల‌కు షోల‌కు కూడా చాలా చోట్ల అనుమ‌తులు వ‌చ్చేశాయి. ఇక్క‌డ కొన్నీ కీల‌క థియేట‌ర్ల‌లో వేసే స్పెష‌ల్ షోలు, బెనిఫిట్ షోల‌కు ఏకంగా రు. 3 వేల వ‌ర‌కు టిక్కెట్లు బ్లాక్ లో ప‌లుకుతున్నాయి. గ‌తంలో ప్ర‌భాస్ బాహుబ‌లి సీరిస్ సినిమాల‌కు మాత్ర‌మే ఈ రేంజ్‌లో టిక్కెట్ల‌కు రేట్లు ప‌లికాయి.


ఇక ముంబై లోని మైన‌స్ పీవీఆర్‌లో అధికారికంగానే ఒక్కో టిక్కెట్ రేటు రు. 2 వేలు ప‌లుకుతోంది. ఢిల్లీలో రు. 1850 నుంచి కొన్ని చోట్ల 1350 - 1400 వరకు ఒక్కో టిక్కెట్ రేటు ప‌లుకుతోంది. ఇక బెంగ‌ళూరులో అయితే రిలీజ్ రోజు రు. 1100 - 1400 వ‌ర‌కు ప‌లుకుతోంది. హైద‌రాబాద్‌లోనే రు. 500 మాత్ర‌మే టిక్కెట్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: