తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తాజాగా ఒక సంచలన కాంబినేషన్ సెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక సంచలన కాంబినేషన్ ఏంటి అందులో ఎవరెవరు నటిస్తున్నారు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఒక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చేయాలి అని అట్లీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక జవాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన అట్లీ గురించి ప్రత్యేక పరిచయం

 అవసరం లేదు. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా దాదాపుగా 1000 కోట్లకు పైగానే వసూళ్లను అందుకుంది. దీంతో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ   చేయబోయే తదుపరి సినిమాపై భారీ అంచునాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన సల్మాన్ ఖాన్ తో సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం వినబడుతుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమాలో రజనీకాంత్ సైతం ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్

 వస్తున్నాయి. ఇక ఇద్దరి సూపర్ స్టార్స్ ను దృష్టిలో పెట్టుకొని తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ  ఎటువంటి స్క్రిప్ట్ రెడీ చేస్తాడో అన్నది తెలియాల్సి ఉంది. ఇకపోతే వచ్చే నెలలో రజనీకాంత్‌, సల్మాన్‌ఖాన్‌తో కలిసి అట్లీ స్క్రిప్ట్‌ను వివరించబోతున్నారని అంటున్నారు. ఒకవేళ ఈ కాంబినేషన్‌ కార్యరూపం దాల్చితే, బాక్సాఫీస్‌ వద్ద సంచనాలు క్రియేటవ్వడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్   'సికందర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. మురుగదాస్‌ దర్శకుడు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయిన అనంతరం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ  -సల్మాన్‌ఖాన్‌ కాంబో మూవీ పట్టాలెక్కనుంది. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: