ప్రభాస్ కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా విజువల్స్ ఉన్నాయి. ఇప్పటికే పలుచోట్ల బుకింగ్స్ ఓపెన్ అవ్వగా టికెట్లు హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. అయితే మూవీ ప్రమోషన్స్ మాత్రం చాలా తక్కువ చేస్తున్నారు. తాజాగా కల్కి టీమ్ నుంచి ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, ప్రియాంక దత్, స్వప్న దత్ లు కలిసి ఓ స్పెషల్ చిట్ చాట్ చేసి వీడియో రిలీజ్ చేశారు.

 తాజాగా ఇప్పుడు బుజ్జి కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి.. చేతుల్లో పడింది. కాంతారా సినిమాతో.. బ్లాక్ బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. సినిమా ప్రమోషన్స్ లో రిషబ్ శెట్టి కూడా పాల్గొంటూ బుజ్జి కారుని డ్రైవ్ చేసేసారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. "టీజర్ లో బుజ్జి గ్లింప్స్ చూడగానే నాకు సినిమాలో బుజ్జి రేంజ్ ఎలా ఉండబోతుందో అర్థం అయిపోయింది. బుజ్జి ని డ్రైవ్ చేయడం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆల్ ద బెస్ట్ భైరవ అండ్ బుజ్జి. కల్కి సినిమా జూన్ 27న విడుదల

 కాబోతోంది. మీ అందరూ కచ్చితంగా థియేటర్లకు వెళ్లి సినిమాని చూడండి. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ సార్" అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు రిషబ్ శెట్టి. ఇకపోతే దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై అంచనాలు పెంచేసాయి.రీసెంట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: