తమన్నా పేరు కంటే మిల్కీ బ్యూటీ అంటే ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.దాదాపు 20ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్ల అందరిలోనూ తమన్న చాలా ప్రత్యేకం. ఈ అమ్మడు తన హద్దులు చెరిపేసిన గ్లామర్ తో ఇటీవల బాగా పాపులర్ అవుతోంది. తాజాగా తమన్నా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. తమన్నా ఆ ఒక్క రోజు మాత్రం అస్సలు స్నానం చేయదట. మిల్కీబ్యూటీగా పాపులర్ అయిన తమన్నా ఇటీవల కాలంలో లస్ట్ స్టోరీస్ 2 లాంటి వెబ్ సిరీస్ లతో విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. ఇక రీసెంట్ గా జైలర్ సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ కు ఎంతటి రెస్పాన్స్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జైలర్ సినిమాలో తమన్నా చేసిన ఈ సాంగ్ ఆ సినిమా సక్సెస్ కి బాగా హెల్ప్ అయింది.కొంతకాలంగా టాలీవుడ్ కు దూరమైన తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లోనే సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. మరోవైపు న ప్రియుడు విజయ్ వర్మ గురించిన వార్తలతో ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఆదివారం రోజు అస్సలు స్నానం చేయదట. సాధారణంగా ఆదివారం అనగానే చాలా మంది తలంటూ స్నానం చేసి వీక్ మొత్తం మోసిన భారాన్ని దించేసుకుంటారు. కానీ తమన్నా మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకమట. ఆదివారం స్నానం మాత్రం చేయదట. మరి ఇలాంటి వింత అలవాటు తమన్నాకు ఎందుకు ఉంది ? అంటే దానికి ఆన్సర్ కూడా ఉంది. వీక్ డేస్ లో తమన్నా మేకప్ కారణంగా ఒక్కరోజులో ఏకంగా మూడు నాలుగు సార్లు స్నానం చేయాల్సి వస్తుంది.ఇలా వారం మొత్తం రోజుకి మూడు సార్లు స్నానం చేసి విసిగిపోయిన ఈ బ్యూటీ సండే రోజు మాత్రం స్నానానికి బ్రేక్ఇస్తుందట. ఇక అంతకుముందే ఓ ఇంటర్వ్యూలో తనకు రాత్రి 7 దాటిన తర్వాత బయటకు వెళ్లడం, పని చేయడం అస్సలు నచ్చదంటూ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన ఈ సండే స్నానానికి బ్రేక్ అనే వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎంతైనా ఈ బ్యూటీ అందం పరంగానే కాదు వ్యక్తిత్వం పరంగా కూడా ప్రత్యేకమే అంటున్నారు ఆమె అభిమానులు. తమన్నా ప్రస్తుతం ఓదెల 2 అనే తెలుగు సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: