తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే అనేక మంది హీరోలు అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి నితిన్ కొన్ని సంవత్సరాల క్రితం ఇష్క్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ మనీ నిత్య మీనన్ హీరోయిన్గా నటించగా , విక్రమ్ కే కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

అప్పటి వరకు వరుస అపజాయలతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన స్థితిలో డీల పడిపోయిన నితిన్ కి ఈ మూవీ మళ్లీ అద్భుతమైన విజయం అందించి తిరిగి ఫామ్ లోకి వచ్చే విధంగా చేసింది. ఇకపోతే ఇంత గొప్ప విజయాన్ని సాధించిన ఈ సినిమాలో హీరోగా మొదటి ఆప్షన్ నితిన్ కాదట. మొదట ఒక హీరోను ఈ కథకు హీరోగా విక్రమ్ కే కుమార్ అనుకోవడం , అతనికి కథను కూడా వినిపించడం జరిగిందట. కానీ ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ నితిన్ కి వచ్చిందట. విక్రమ్ మొదట ఈ కథకు అనుకున్న హీరో ఎవరు .. అతను ఎందుకు ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

విక్రమ్ కె కుమార్ "ఇష్క్" మూవీ కథను రెడీ చేసిన తర్వాత దీనికి మంచి గుర్తింపు కలిగిన స్టార్ హీరో అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో రవితేజ ఈ మూవీలో హీరోగా సెట్ అవుతాడు అనే ఆలోచనలో రవితేజకు ఈ కథను వినిపించాడట. కథ మొత్తం విన్న రవితేజ కథ సూపర్ గా ఉంది. కాకపోతే ఇప్పుడు కమర్షియల్ సినిమాలు చేస్తున్నాను. రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలు చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మీరు వేరే ఎవరితోనైనా చేయండి. సినిమా సూపర్ గా ఉంటుంది అని చెప్పాడట. దానితో నితిన్ ను కలవడం , కథ వినిపించడం , ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా రవితేజ తో అనుకున్న ఇష్క్ మూవీ నితిన్ తో వచ్చి సూపర్ సక్సెస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: