మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నేను శైలజ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని , గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇకపోతే ఆ తర్వాత ఈమె కొన్ని కమర్షియల్ సినిమాలలో నటించింది. అలాంటి సమయంలోనే ఈ బ్యూటీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

మూవీ అద్భుతమైన విజయం సాధించడం , అందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు ఈ సినిమా ద్వారా క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించింది. కానీ మహానటి స్థాయి విజయం మాత్రం ఇప్పటి వరకు ఈమెకు ఏ లేడీ ఓరియంటెడ్ మూవీ ద్వారా లభించలేదు. ఇకపోతే ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో చాలా కమర్షియల్ సినిమాలలో నటించిన అందాలను పెద్దగా ఆరబోయ లేదు. ఇక ఈ మధ్య కాలంలో ఈమె తన అందాలను కూడా వెండి తెరపై బాగానే ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తోంది.

ఇకపోతే తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తనకు ఒక హీరోతో నటించాలి అనే కోరిక ఉన్నట్లు ఈ బ్యూటీ తెలియజేసింది. తాజాగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ... తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటనలో ఒకరు అయినటువంటి శింబు తో ఒక సినిమా నటించాలి అని ఉన్నట్లు తెలియజేసింది. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఈ రెండు ఇండస్ట్రీ లలో కూడా ఈమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks