ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయిన తర్వాత యావరేజ్ టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే ప్రేక్షకులు ఎవరు పెద్దగా అలాంటి సినిమాలపై ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎలాగో నెల రోజుల్లో ఓ టీ టీ లోకి వస్తాయి ప్రశాంతంగా ఏ డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లో చూడొచ్చు అనే ఉద్దేశంతో కొన్ని సినిమాలను అవైడ్ చేస్తున్నారు. ఇక అలాంటి సినిమాలకు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

ఈ లిస్టులోకే తాజాగా మరో సినిమా కూడా చేరింది. ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న అభినవ్‌ గోమఠం తాజాగా మస్తు షేడ్స్ ఉన్నాయి రా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయి టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇకపోతే ఆ తర్వాత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర యవరేజ్ టాక్ ను తెచ్చుకున్న ఈ మూవీ కి ఓ టీ టీ లో మాత్రం అదిరిపోయి రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ మార్చి 29 వ తేదీ నుండి ప్రముఖ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 100 ప్లస్ మిలియన్ రియల్ టైం వ్యూస్ ను సాధించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేయని ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో మాత్రం ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: