అయితే ఇలా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు కొన్ని కొన్ని సార్లు నిజమైతే కొన్ని మాత్రం కేవలం పుకార్లు గానే మిగిలిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి ఎన్టీఆర్ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ తో పాటు ఇక ప్రశాంత్ నీల్ మూవీ ని కూడా లైన్లో పెట్టేసాడు. ఇక మరి కొంతమంది డైరెక్టర్ల కథలు కూడా వింటున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నానితో హాయ్ నాన్న సినిమాను తెరకెక్కించిన శౌర్యవ్ తో సినిమా చేసేందుకు తారక్ రెడీ అయ్యాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
విభిన్నమైన కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కపోతుందని ఏకంగా రెండు పార్టీలుగా తెరకెక్కబోతున్నట్లు ఒక న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఇక ఈ విషయంపై ఇటీవల డైరెక్టర్ శౌర్యవ్ స్పందించాడు. తాను తారక్ తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇది నిజం కాదు ఈ వదంతులు ఎలా మొదలయ్యాయో నాకు తెలియదు. దురదృష్టవశాత్తు ఇది నిజం కాదు. కానీ నిజం కావాలని కోరుకుంటున్నా. ఇక తారక్ తో మూవీ కోసం ఎదురు చూస్తున్న. ఇది వార్త నిజమైతే బాగుండు అంటూ శౌర్యవ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.