సాధారణంగా సినిమాను ఎంత పకడ్బందీగా తెరకెక్కించినప్పటికీ.. ఇక సినిమా కోసం ఎంత భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలి అంటే మాత్రం ప్రమోషన్స్ కంపల్సరీ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు సైతం ఈ మధ్యకాలంలో అటు సినిమాలో నటించడం విషయంలోనే కాదు ఇక ప్రమోషన్స్ నిర్వహించడం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వినూత్నమైన రీతిలో ప్రమోషన్స్ చేసి ఇక సినిమా గురించి ప్రేక్షకులు అందరూ కూడా ఆలోచించేలా చేస్తూ ఉన్నారు.


 ఇక ఈ మధ్యకాలంలో అయితే చాలామంది ఏకంగా బుల్లితెర షోస్ లో కనిపిస్తూ తమ సినిమాలకు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు.  ఇక మరి కొంతమంది యూట్యూబర్లను అప్రోచ్ అవుతూ ఇక వాళ్లతో ఒక స్పెషల్ వీడియో చేసి ఇక ప్రమోషన్స్ చేయించుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఇప్పుడు రవితేజ మాత్రం సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఏ హీరో ట్రై దేని విధంగా సరికొత్తగా ట్రై చేశాడు రవితేజ. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. మరి కొన్ని రోజుల్లో రవితేజ మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్ పరిక్షకులు అందరిలో కూడా అంచనాలను పెంచేస్తుంది అని చెప్పాలి. కాగా ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే ఎవరు ఊహించని విధంగా సరికొత్తగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది ఈ సినిమా టీం. హైదరాబాద్ మెట్రోలో అనౌన్స్మెంట్లో.. తలుపు ఎడమ వైపున తెరుచుకుంటుంది అని మాత్రమే వింటున్న ప్రయాణికులు అందరిని కూడా హీరో రవితేజ వాయిస్ సర్ ప్రైస్ చేసింది. హలో తమ్ముళ్లు సీట్ దొరకలేదని నిలబడ్డారా.. ఏం పర్వాలేదు అంటూ చెబుతూ ఇక మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదలవుతుందని ఇక అందరూ తప్పకుండా థియేటర్లకు రావాలని.. అక్కడ మీ కోసం సీట్లు ఉన్నాయి అంటూ ఒక వాయిస్ ఇవ్వగా ఇక మెట్రోలో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యి నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: