ఇకపోతే విద్యాసాగర్ మరణించిన తర్వాత ఈమె మళ్లీ వివాహం చేసుకోబోతోంది అంటూ ఎన్నో రూమర్లు వచ్చాయి. వీటిపై ఖండిస్తూ సమాధానాలు కూడా తెలియజేసింది. అయితే ఇప్పుడు మరొకసారి ఈమె పై ఒక కొత్త రూమర్ మొదలయ్యింది... ధనుష్ ను రెండో పెళ్లి చేసుకోబోతోంది అనేది ఆ రూమర్ సారాంశం. ధనుష్ 2004లో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ను వివాహం చేసుకున్నారు.. వీరికి ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు . అయితే ధనుష్ - ఐశ్వర్య కూడా 2022లో విడిపోయారు. అప్పటినుండి సింగిల్గానే ఉంటున్నారు. అందుకే ఇప్పుడు ధనుష్ , మీనా పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఇక ఈ వార్తను పట్టుకొని యూట్యూబర్స్ అలాగే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశారు. ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచింది వారు రాసుకున్నారు అయితే ఇదంతా ట్రాష్ అని కూడా ఆమె కొట్టిపడేసింది. తన గురించి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్న మీడియా పట్ల అసహనం వ్యక్తం చేసింది.
అయితే ప్రముఖ నటుడు శరత్ కుమార్ మీనా విషయంలో యూట్యూబర్స్ పై మండిపడ్డారు . ఈ విషయంలో మీనా గురించి చెడుగా ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. నిజానికి మీనా వయసు 47 ఏళ్లు, ధనుష్ వయసు 41. వీళ్లిద్దరూ కలిసి నటించిన దాఖలాలే లేవు.. అయినా సరే ఇలాంటి పనికిరాని రూమర్స్ క్రియేట్ చేయడం ఏంటో అర్థం కావట్లేదు అంటూ ఆయన కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
.