అయితే అలాంటి అల్లు అర్జున్ ని నువ్వేమైనా పెద్ద పుడింగివా అంటూ అవమానించింది ఎవరో కాదు తమిళ జనాలు.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో అంటే 2014లో ప్రో కబడ్డీ స్టార్ట్ అయిన సమయంలో 2017లో తమిళ్ తలైవాస్ అనే టీం కి బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్,రామ్ చరణ్ లని కమల్ హాసన్ నియమించారు.ఇక ఆ సమయంలో అల్లు అర్జున్, రామ్ చరణ్, కమల్ హాసన్ లు కలిసి జట్టుకు సంబంధించి భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. ఇక ఈ ప్రమోషన్ ఈవెంట్లో మీడియా వాళ్ళు రామ్ చరణ్, కమల్ హాసన్, అల్లు అర్జున్ లని పలు ఆసక్తికరమైన విషయాలు అడిగి తెలుసుకున్నారు. అయితే స్టేజ్ పై బన్నీ చేసిన పని తమిళ ప్రేక్షకులకు కోపాన్ని తెప్పించింది. అదేంటంటే.. స్టేజ్ పై రామ్ చరణ్, కమల్ హాసన్ మామూలుగా కూర్చుంటే అల్లు అర్జున్ మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంతో తమిళ జనాల కోపానికి బలయ్యారు.
అంత పెద్ద స్టార్ హీరో అయిన కమల్ హాసన్ ముందు అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడమా..అంత పొగరెందుకు.. లెజెండ్రీ నటుడే ఒద్ధికగా కూర్చుంటే అల్లు అర్జున్ మాత్రం ఆ పెద్ద హీరో ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుని కుప్పిగంతులు వేయడం ఏంటి అంటూ తమిళ ఫ్యాన్స్అల్లు అర్జున్ పై ట్రోల్ చేశారు. తమిళులకు భాష, ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉంటుంది. దాంతో కమల్ హాసన్ ముందే అల్లు అర్జున్ అలా కూర్చోవడం తో ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో బయటపడింది అని చాలామంది సోషల్ మీడియా వేదికగా బన్నీ పై నెగటివ్ కామెంట్లు పెడుతూ రచ్చ రచ్చ చేశారు.అంతే కాదు నువ్వేమైనా పుడింగువా.. ఒళ్ళు పొగరు తగ్గించుకో.. అంటూ కొన్ని నెగెటివ్ ట్వీట్లు అల్లు అర్జున్ పై చేశారు తమిళ ఫ్యాన్స్. అప్పట్లో ఈ వివాదం పెద్ద సంచలనం సృష్టించింది.