అయితే భర్త చనిపోయాక కొద్ది రోజులు ఇంటి దగ్గరే ఉన్న మీనా మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయింది. ఇక ఈ హీరోయిన్ రెండో పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. వీటిని చాలాసార్లు మీనా ఖండించింది.ఇదంతా పక్కన పెడితే మీనా విద్యాసాగర్ తో పెళ్లి కంటే ముందే ఆ హీరోని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అంటూ అప్పట్లో తమిళ మీడియాలో ఒక వార్త గట్టిగా వినిపించింది. ఇక ఆ హీరో ఎవరో కాదు కిచ్చా సుదీప్.. కన్నడ హీరో కిచ్చా సుదీప్, మీనా కాంబినేషన్లో స్వాతిముత్తు, మై ఆటోగ్రాఫ్ అనే రెండు సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాల్లో నటించే సమయంలోనే వీరి మధ్య లవ్ రూమర్స్ వినిపించాయి. ఇక 2006లో విడుదలైన మై ఆటోగ్రాఫ్ సినిమా సమయంలో వీరిద్దరి గురించి ఒక సంచలన మ్యాటర్ తమిళంలో ప్రచారం అయింది. అదేంటంటే..
కిచ్చా సుదీప్ హీరోయిన్ మీనా ఇద్దరు రహస్యంగా ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారనే వార్త తమిళ మీడియాని కుదిపేసింది.దాంతో ఈ వార్తలు వైరల్ అయిన వెంటనే అటు మీనా ఇటు సుదీప్ ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.అలాగే మీరు అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య చెడు రిలేషన్ ఏమీ లేదు. మా మధ్య మంచి స్నేహం ఉంది అంటూ మీనాతో పాటు సుదీప్ కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో వీరి సీక్రెట్ పెళ్లి వార్తలకు చెక్ పడింది. కానీ మీనా భర్త చనిపోయాక కిచ్చా సుదీప్ ని మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందని మళ్ళీ రూమర్స్ వినిపించాయి. అంతేకాకుండా ధనుష్, మీనా లు రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్ కూడా తమిళ మీడియాలో వినిపించింది. కానీ ఈ వార్తలన్నీ పూర్తిగా అబద్ధం అని మీనా క్లారిటీ ఇచ్చింది.