హీరోయిన్ నమిత తన అందాలతో ఒకప్పుడు ఇండస్ట్రీని కట్టిపడేసిన ముద్దుగుమ్మ. ఇక ఈమె తెలుగులో ఎక్కువగా నటించకపోయినప్పటికీ తమిళ ప్రేక్షకులు మాత్రం ఈమె అందానికి దాసులయ్యారు. అలా తమిళంలో కుష్బూ తర్వాత మళ్లీ అంత ఫేమస్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే కేవలం నమిత మాత్రమే. తెలుగులో జెమినీ, సొంతం, ఒక రాధా ఇద్దరు కృష్ణుల ప్రేమ కథ వంటి సినిమాల్లో నటించినప్పటికీ తమిళంలో మాత్రమే నమితకు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది.

అయితే అలాంటి నమిత ఆరోగ్య సమస్యల కారణంగా బరువు పెరిగిపోవడంతో అవకాశాలు తగ్గాయి. ఇక ఈమె బరువు పెరిగాక కూడా బాలకృష్ణ సింహ మూవీ లో ఐటెం సాంగ్ అలాగే ప్రభాస్ బిల్లా సినిమాలో కూడా నటించింది. అయితే నమిత బరువు పెరిగిపోవడంతో ముద్దుగుమ్మ కాస్త బొద్దుగుమ్మ అయింది అంటూ చాలా మంది ఈమె పై ట్రోల్స్ చేశారు. అయినప్పటికీ వాటిని లెక్క చేయలేదు. ఈ విషయం పక్కన పెడితే నమితని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలని చూసారట. మరి ఇంతకీ కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నమిత ఇద్దరు కవల పిల్లలకు కూడా జన్మనిచ్చింది.

ఇక మొదటిసారి ఈమె తన పిల్లలు, భర్తతో కలిసి తిరుమలకు వచ్చిన సమయంలో సినిమాలు చేస్తారా అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు కానీ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పింది. అలాగే బిజెపి కార్యవర్గ సభ్యురాలిగా కూడా నమిత ఉంది. అయితే అలాంటి నమిత రీసెంట్ గా తన జీవితంలో జరిగిన ఓ చీకటి రోజుని గుర్తు చేసుకొని బాధపడింది. విషయంలోకి వెళ్తే..నమిత ఓ రోజు సినిమా షూటింగ్ కోసం తన మేనేజర్ తో కార్ కోసం వెయిట్ చేసిన సమయంలో ఒక వ్యక్తి నేనే మీ కార్ డ్రైవర్ ని అని నమిత ని, మేనేజర్ ని ఎక్కించుకొని వెళ్లారట. ఇక కారు ఎక్కిన సమయంలో నమిత హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటుందట.

ఆ తర్వాత ఎంతసేపటికి తాను వెళ్లాల్సిన గమ్యం రాకపోయేసరికి నమితకి అనుమానం వచ్చిందట. అంతే కాకుండా డ్రైవర్ భాష కూడా అనుమానంగా ఉండడమే కాకుండా ఆ కారుని మరో అయిదు కారులు వెనకాలే ఫాలో అయ్యాయట. దాంతో ఇదంతా ఏంటి అని అడిగేసరికి మీరు కిడ్నాప్ అయ్యారు అని మేనేజర్ చెప్పారట. అయితే ఆ డ్రైవర్ రూపంలో నమితని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఆమె వీరాభిమాని. కిడ్నాప్ చేసి నమితను పెళ్లి చేసుకోవాలని చూసారట. అయితే ఈ సంఘటన 2009లో జరిగిందని,షూటింగ్ కోసం కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు జరిగిందని, ఈ సంఘటన నా జీవితంలో మర్చిపోలేను అంటూ నమిత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: