ప్ర‌భాస్-హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేషన్ లో ఫౌజి అనే సినిమా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతుంద‌నే వార్త‌తో టాలీవుడ్ లో ఒక్క‌సారిగా ఈ మూవీ హాట్ టాపిక్ గా మారింది. అయితే, క్లాస్ సినిమాల‌కు కేరాఫ్ గా ఉండే హ‌ను రాఘ‌వ‌పూడి ఈసారి ప్ర‌భాస్ ను ఇంకెంత క్లాస్ గా చూపించ‌బోతున్నాడో అని అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మ‌రో వార్త సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ ను కాస్త క్లాస్ ట‌చ్ ఇచ్చి పూర్తి మాస్ గా

 చూపెట్ట‌నున్నాడ‌ట ఈ డైరెక్ట‌ర్. హ‌ను రాఘ‌వ‌పూడి లాంటి డైరెక్ట‌ర్ ప్ర‌భాస్ ను మాస్ లుక్ లో చూపెట్ట‌నున్నాడంటే, ఆయన తీయ‌బోయే సినిమా ఎలా ఉండ‌బోతుందా అనే ఆస‌క్తి అభిమానుల్లో ఎక్కువైంది. ఇక ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ పెట్ట‌నున్నార‌ని.. ఈ సినిమాలో ప్ర‌భాస్ ఓ సైనికుడి పాత్ర‌లో న‌టిస్తాడ‌నే వార్తలు ఇప్ప‌టికే చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  ఇదిలవుండగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం పూజా కార్యక్రమం 2024 ఆగస్టు 17న హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్‌ ఇన్‌సైడ్‌. ఈ సెర్మనీకి

 ప్రభాస్‌, హనురాఘవపూడితోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారట. ఫౌజీ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో కనిపించబోతున్నట్టు టాక్‌. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్ర పోషిస్తున్నాడరని ఇప్పటికే నెట్టింట వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. ఇండస్ట్రీ సర్కిల్‌ లో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం ఫౌజీ.. సీతారామం, రాధేశ్యామ్ లా వింటేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని తెలుస్తోంది. ఇకపోతే అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీలోనే మంచి మార్కులు కొట్టేశాడు హను రాఘవపూడి  ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్ 2022లో దుల్కర్‌ సల్మాన్‌, మృణాళ్‌ ఠాకూర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ సీతారామం సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: