మాస్ యాక్షన్‌ చిత్రాల స్పెషలిస్ట్‌ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంగువ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో మరో హీరో ఎంట్రీ ఉంటుందన్న వార్తలు ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. కంగువలో సూర్యతో పాటు కార్తి కూడా నటిస్తున్నారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి.  ఈ సినిమా అక్టోబర్ 10, 2024న విడుదల

 కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ విడుదల చేసిన ఈ చిత్రం యొక్క ఫస్ట్ సింగిల్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెకండ్ సింగల్ ని త్వరలో విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో యోగి బాబు, సంజయ్ దత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని

 ఆకట్టుకోబోతోందీ సినిమా. పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా ‘కంగువ’ సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉండగా సూర్య సోదరుడు కార్తీ కంగువ క్లైమాక్స్ లో అతిథి పాత్రలో మెరుస్తాడని తెలుస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉందని, సూర్య – కార్తీల ఎపిసోడ్ సీక్వెల్‌కు దారితీస్తుందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: