1980-90 మ‌ధ్య కాలంలో హీరో-హీరోయిన్లగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగిన యాక్టర్స్ అందరూ ఏటా గెట్ టుగెదర్ ఈవెంట్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రీ-యూనియ‌న్ హైద‌రాబాద్, చెన్నై, బెంగుళూరు ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క నగరంలో జరుగుతోంది. అప్పటి రోజులను చాలామంది గుర్తుతెచ్చుకుంటూ హాయిగా ఫీలవుతున్నారు. ఈ రీయూనియన్ లో సుహాసిని, రాధ‌, రాధిక‌, మీనా ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు సౌత్ హీరోయిన్లందరూ హాజ‌ర‌వుతుంటారు. ఇక హీరోలు కూడా దీనికి తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత స్పెషల్ గా మార్చేస్తుంటారు. 

ఆ హీరోలలో చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, భాను చంద‌ర్ లాంటి వాళ్లు ఉన్నారు. వీళ్లందరూ అలనాటి హీరోయ‌న్ల‌తో క‌లిసి అప్పటి మ‌ధుర జ్ఞాప‌కాలు నెమర వేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసుకొని అభిమానులకు కూడా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. అయితే ఈ కార్యక్రమం ఆ జనరేషన్ హీరో హీరోయిన్లతో కలకలాడుతుంది కానీ ఒక లోటు మాత్రం కనిపిస్తుంది అదేంటంటే రాజ‌మండ్రికి చెందిన అప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ మాత్రం ఈ ఈవెంట్ కు రాదు. 

 ఆమెను కూడా తీసుకురావాలని చాలామంది ప్రయత్నించారు కానీ అది సాధ్యపడలేదు ఎందుకు ఈ కార్యక్రమానికి రావడం లేదు అనేదానికి మాత్రమే సరైన సమాధానం దొరకడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా భానుచంద‌ర్ భానుప్రియ ఈవెంట్ కు ఎందుకు రావడం లేదో చెప్పారు. "సుహాసిని ,లిజీ గెట్ టుగెదర్ పార్టీ ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ముందుగా ఒక ఆలోచనకు వచ్చారు అవి సంగతి నాకు చెప్పగానే నేను కూడా ఒప్పుకున్నాను. కలుసుకున్నప్పుడల్లా పాత విషయాలన్నీ మాట్లాడుకుంటూ హాయిగా నవ్వుకుంటాం. అప్పట్లో వెండితెరపై భార్యాభర్తలుగా లవర్స్ గా నటించిన మా మధ్య నిజ జీవితంలో ఎప్పుడూ లవ్ అనే టాపిక్ వచ్చేది కాదు. భానుప్రియని కూడా చాలా సార్లు పిలిచాను కానీ ఆమెకు కొన్ని ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఈవెంట్ కు రాకుండా ఉంటుంది. ఇక ఆమె రాకపోయినా మాకు అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో అందరం మంచిగా మాట్లాడుకుంటాం.' అని భానుచందర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: