తనతో సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది కూడా . " 2021 డిసెంబర్ 13న ఒరియో మా కుటుంబంలోకి వచ్చింది . ఈ ఏడాది జులై 27న స్పష్టంగా అందరినీ వదిలి వెళ్ళిపోయింది . నా పెళ్లి చాలా అమాయకమైనది . దానికి కనీసం ఎలా అరవాలో కరవాలో కూడా తెలియదు . రోజు లాగానే జూలై 27న ఉదయం 3:45 గంటలకు బయట వీధిలోకి వెళ్ళింది . 5:30 కళ్ళ ఇంటికి తిరిగి వచ్చేది . కానీ ఆరోజు రాలేదు .
సాయంత్రం నాలుగు వరకు వెతుకుతూనే ఉన్నాం . చివరికి అది చనిపోయి కనిపించింది . సెక్యూరిటీ గారుడుల నిర్లక్ష్యం వల్ల వీధి కుక్కలు కమ్యూనిటీ లోపల కు వచ్చాయి . నా బిడ్డ ను వెంటాడి మరీ చంపేసాయి . ఆ సమయంలో తాను ఎంత బాధపడిందో ఊహించుకోడానికే కష్టంగా ఉంది . ఓరియో పడ్డ వేదనను తలుచుకుంటుంటేనే కష్టంగా ఉంది . ఓరియో అంటే నాకు ప్రాణం . దాన్ని ఎంతగానో మిస్ అవుతున్నాను " అంటూ గీతు రాయల్ తన పోస్టులో రాసుకొచ్చింది . ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .