ఈ ఇద్దరు కలిసి రెండు సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి ఇద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అవుతునారు. విజయ్ ఎక్కడ ఉంటే రష్మిక కూడా అక్కడే అనేలా వీరి ప్రవర్తన ఉంది. హాలీడే ట్రిప్పులు వేస్తుంటారు. ఇద్దరు సెపరేట్ గా పిక్స్ షేర్ చేస్తుంటారు. కానీ బాగా అబ్సర్వ్ చేస్తే ఇద్దరు ఒకే లొకేషన్ లో ఉన్నట్టు ఆడియన్స్ కనిపెట్టేస్తారు. ఇక విజయ్ మాటే తనది అన్నట్టుగా ఒకరి ఇష్టాల గురించి ఒకరు చెబుతారు.
ఇదిలాఉంటే లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ నెక్స్ట్ ప్రాజెక్ట్ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో వస్తుంది. ఆ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ పై రష్మిక మ్యాడ్ నెస్ అంటూ ఫైర్ సింబల్ ని పెట్టింది. విజయ్ పోస్టర్ రిలీజైతే చాలు రష్మిక ఇలా స్పందిస్తుంది. విజయ్ ఎక్కడ ఉంటే రష్మిక అక్కడే అన్నట్టు ఉంది. ఐతే ఈ పోస్టర్ విజయ్ అంతకుముందే రష్మికకు చూపించి ఉండొచ్చు కానీ అఫీషియల్ రిలీజ్ తర్వాత ఆమె కూడా ప్రమోట్ చేస్తుంది. సో అలా విజయ్ గురించి ప్రతిదీ స్పెషల్ గా కేర్ తీసుకుంటున్న రష్మిక ఇంతకన్నా వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పడానికి వేరే రీజన్స్ అక్కర్లేదు అనుకుంటా.