తెలుగు బుల్లితెరపై ఎన్నో షో లకి యాంకర్ గా వ్యవహరించి ఎంతో మంది బుల్లి తెర అభిమానులను సంపాదించుకున్న నటి విష్ణు ప్రియ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె యాంకరింగ్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలలో , వెబ్ సిరీస్లలో కూడా అవకాశాలను దక్కించుకుంది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో రూపొందిన దయ అనే వెబ్ సిరీస్ లో కీలకమైన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ కూడా సూపర్ సక్సెస్ కావడంతో దీనితో ఈమెకు మంచి గుర్తింపు కూడా లభించింది. ఇకపోతే ఈ బ్యూటీ ఎక్కువగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్ లను నిర్వహించి వాటిని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే విష్ణు ప్రియ కు సంబంధించిన అనేక హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తెలుగు బిగ్ బాస్ ప్రారంభం కానుంది అంటే చాలు విష్ణు ప్రియ అందులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అని అనేక వార్తలు వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈమె కొంత కాలం క్రితం మీరు బిగ్ బాస్ లోకి వెళతారా అని కొంత మంది మీడియా వారు ప్రశ్నించగా నేను బిగ్ బాస్ లోకి ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్ళను , నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని సమాధానం ఇచ్చింది.

ఇకపోతే మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. ఇందులోకి విష్ణు ప్రియ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా ఈ బ్యూటీ స్పందిస్తూ ... నేను అందులోకి వెళితే పది కిలాల వరకు బరువు తగ్గుతాను కావచ్చు. ఇలా మీరు ఎప్పుడూ బిగ్ బాస్ లోకి నేను వెళతాను వెళతాను అనడం వల్ల నేను వెళ్తాను కావచ్చు అంటూ సమాధానం ఇచ్చింది. ఇక ఈ బ్యూటీ ఒకప్పుడు కోట్లు ఇచ్చిన వెళ్లను అంది ఇప్పుడేమో వెళతాను కావచ్చు అంటుంది. దీనితోనే ఈమె మనసు మారినట్లు తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: