తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపు ప్రసంపాదించుకున్న యువ నటీమణులలో మాళవిక మోహన్ ఒకరు. ఈమె నటించిన తమిళ సినిమాలు చాలా వరకు తెలుగులో విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు నిర్మిస్తున్న రాజా సాబ్ మూవీ లో ఈ బ్యూటీ ప్రభాస్ కి జోడిగా నటిస్తోంది. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ బ్యూటీ కి తెలుగు లో మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. 

ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా మరో అదిరిపోయే క్రేజ్ ఉన్న సీక్వెల్ లోకి ఛాన్స్ కొట్టేసింది. కొంత కాలం క్రితం కోలీవుడ్ నటుడు కార్తీ హీరోగా సర్దార్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా సర్దార్ 2 అనే సినిమాను రూపొందించబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే నిన్న మాళవిక మోహన్ పుట్టిన రోజు కావడంతో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈమె క్రేజ్ అదిరిపోయే రేంజ్ లో పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: