ఇది ఓ రొమాంటిక్ సాంగ్ గా ఉండబోతుందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అందాల జాన్వీ కపూర్ నడుముపై ఎన్టీఆర్ చేయి వేసి ఆమె కళ్లలోకి చూస్తున్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్‌అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ విడుదల చేయగా.. యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.పోస్టర్ లో ఈ జంట చూడముచ్చటగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.