ఈ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన హీరోల లిస్టులోకి చేరిపోయాడు. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం ఎందుకో విజయ్ దేవరకొండకు అసలు కలిసి రావడం లేదు. ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ కావడం లేదు. గతంలో లైగర్ అనే భారీ బడ్జెట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు విజయ్. అతని కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే మొన్నటికి మొన్న ఫ్యామిలీ స్టార్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇది పెద్దగా హిట్ కాలేకపోయింది అని చెప్పాలి. ఇలా హిట్ అనే పదానికి దూరమైన విజయ్ దేవరకొండ ఇక ఇప్పుడు కథలు ఎంపికలు ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
ఇక ఇప్పుడు గౌతం తిన్ననూరి దర్శకత్వంలో VD12 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది అని చెప్పాలి. ఈ మూవీని సీతారా ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉంది. రెండు భాగాలుగా సినిమా ఉండబోతుంది అన్నది తెలుస్తోంది. అయితే ఇప్పుడు రౌడీ హీరో లైనప్ చూసి అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. గౌతం తిన్ననూరి సినిమా తర్వాత అటు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో VD 14 చేయబోతున్నాడు. పాన్ ఇండియా మూవీకి ఇది తెరకెక్కుతుంది. పీరియాడికల్ జోనర్లో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో సినిమా ఉండబోతుందట. మరోవైపు రవికిరణ్ కూల దర్శకత్వంలో అటు VD 15 ను కన్ఫర్మ్ చేసేసాడు. ఇక ఇది ముగిసిన వెంటనే వేడివేల్ మూవీకి సీక్వెల్ కూడా ఉండబోతుంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక సుకుమార్ తో ఒక మూవీ చేయబోతున్నాడు. ఇది మాత్రమే కాకుండా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా ప్లాన్ చేశాడు. తర్వాత తరుణ్ భాస్కర్ తో మరో ఇంట్రెస్టింగ్ కథతో మూవీ చేయబోతున్నాడట. ఇలా ఒక సాలిడ్ లైన్ ఆఫ్ ని సెట్ చేసేసుకున్నాడు రౌడీ హీరో ఇది తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.