కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ స్పీడ్ చూసి అభిమానులు అందరూ కూడా పండగ చేసుకుంటుంటే.. ఇతర హీరోల అభిమానులు మాత్రం తెగ ఈర్ష పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు రెండేళ్లకు మూడేళ్లకు ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇక ఇప్పుడు నెలల గ్యాప్ కూడా లేకుండానే సినిమాలను విడుదల చేస్తూ సూపర్ హిట్లు కొడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సలార్ అనే సినిమాతో సాలిడ్ హిట్ సొంతం చేసుకున్న ప్రభాస్ మొన్నటికి మొన్న కల్కి మూవీతో ఇండస్ట్రీ రికార్డులను తుడిచి పెట్టేసాడు అని చెప్పాలి. ఇలా కల్కి సినిమా సూపర్ హిట్ తో జోరు మీద ఉన్న ప్రభాస్.. రాజా సాబ్ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్.. ఇక ఇప్పుడు కొత్త సినిమాలు కూడా మరికొన్ని రోజుల్లో ప్రారంభించబోతున్నాడట. హను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్లో ఫౌజి అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఒక సైనికుడు పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని అందరూ అనుకుంటుండగా.. ఈనెల 17వ తేదీన ఈ సినిమాను ప్రారంభించబోతున్నట్లు టాలీవుడ్ లో ఒక టాక్ చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విషయం తెలిసే ఏంటి బాసు డార్లింగ్ అస్సలు ఆగట్లేదు మరి ఇంత స్పీడ్ ఏంటి అని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.