తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన వారిలో సమంత ఒకరు. ఈమె నాగ చైతన్య హీరోగా రూపొందిన ఏం మాయ చేసావే అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగులో అమాంతం పెరిగింది. ఆ తర్వాత ఈమెకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన బృందావనం , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన దూకుడు సినిమాలలో అవకాశాలు వచ్చాయి. 

ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడంతో ఈమె ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. సమంత ఇప్పటికే తన కెరియర్లో దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. కొంత కాలం క్రితం ఈమె అల్లు అర్జున్ హీరోగా రూపొందిన పుష్ప పార్ట్ 1 మూవీ లో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. కెరియర్ లో మొదటి సారి ఐటమ్ సాంగ్ లో నటించిన ఈ ముద్దు గుమ్మ ఈ సాంగ్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. కెరియర్ ప్రారంభం నుండి సన్నగానే ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా మరింత సన్నబడింది. 

తాజాగా ఈమె ఓ సినిమా ఈవెంట్ కు విచ్చేసింది. ఇక ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో సమంత బక్క చిక్కి కనిపించింది. మునుపటి కంటే సమంత చాలా సన్నబడిన ఈ ఈవెంట్ కి ఈ బ్యూటీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని రావడం , అంతే హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన సమంత ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. సమంత బక్కచెక్కిన అదిరిపోయే రేంజ్ లో ఉంది అని తన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: