తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ సీనియర్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్నాడు. ఇకపోతే తాజాగా బాలకృష్ణతో అనేక సినిమాలను తేరకెక్కించిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా కోదండరామిరెడ్డి , బాలకృష్ణ గొప్పతనం గురించి తెలియజేశాడు. తాజాగా కోదండరామిరెడ్డి మాట్లాడుతూ ... సీనియర్ ఎన్టీఆర్ గారికి నాపై ఎంతో నమ్మకం ఉండేది. దానితో ఒకానొక సమయంలో సీనియర్ ఎన్టీఆర్ గారు పిలిచి బాలయ్య కోసం ఒక మంచి కథను సిద్ధం చేయమని చెప్పారు.

దానితో నేను ఒక సూపర్ కథను ఆయన కోసం సిద్ధం చేసి ఎన్టీఆర్ గారికి వినిపించాను. ఇక పదే పదే నిమిషాలలో ఆ సినిమాను సీనియర్ ఎన్టీఆర్ ఓకే చేశారు. ఇక ఆ కథతో బాలయ్య తో అనసూయమ్మ గారి అల్లుడు అనే సినిమాను స్టార్ట్ చేశాం. ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ చాలా సరదాగా ఉండేవారు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు అయిన ఆయనలో ఏ మాత్రం గర్వం లేకుండా అందరితో చాలా సరదాగా ఉండేవాడు. బాలయ్య సెట్ లోకి వస్తే అందరికీ మొదట నమస్కారం చేసేవారు. అలాగే సెట్ లో ఉన్న వారందరిని పిలిచి భోజనాలు చేశారా ... టీ తాగారా అని అడిగేవాడు.

అలాగే వారిని ఆప్యాయంగా పలకరించి వారి మంచి చెడ్డలను తెలుసుకునేవాడు. అలాగే నేను ఎక్కడ కలిసిన బాలయ్య మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా అని ఎంతో ఆప్యాయంగా అడుగుతూ ఉంటాడు. ఇలా బాలయ్య సీనియర్ ఎన్టీఆర్ కొడుకు అయ్యుండి , తాను కూడా స్టార్ హీరో అయినప్పటికీ అతనిలో ఆ గర్వం ఏ మాత్రం ఉండదు. చాలా సాదా సీదా వ్యక్తిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. అలాగే అందరినీ పలకరిస్తూ ఎంతో బాగుంటాడు అని కోదండరామి రెడ్డి తాజా ఇంటర్వ్యూలో బాలయ్య గురించి చెప్పుకొచ్చాడు. ఇక కోదండరామిరెడ్డి , బాలయ్య గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: