బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ కొత్త సీజన్ లోగోను లాంచ్ చేయడంతోపాటు సెప్టెంబర్ తొలి లేదా రెండో వారం ప్రారంభించనున్నట్లు స్టార్ మా హింట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లు ఎవరు అన్నదానిపై చర్చ జరుగుతుంది. ఇకపోతే ఈ సీజన్ కు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఈసారి ఈ రియాల్టీ షో కోసం అతడు తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లూ గతంలో వార్తలు వచ్చాయి. గత సీజన్ కంటే ఈసారి అది రెట్టింపు కావడం గమనార్హం. అయితే ఈ కొత్త

 సీజన్లో కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా విభజించబోతున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.ఐతే తాజాగా "లేడీస్ అండ్ జెంటిల్మెన్ బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది. తాజాగా సీజన్ 8 టీజర్‌ రిలీజ్ చేశారు.ఈసారి అపరిమితమైన వినోదాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాము..మీరు ధైర్యంగా ఉండండి!" అంటూ వచ్చిన టీజర్ ఆకట్టుకుంటోంది.ఈ టీజర్‌లో కమెడియన్ సత్య కామెడీ, కింగ్ నాగ్ పంచ్ డైలాగ్ అదిరిపోయింది. క్రియేటివ్గా ఉన్నఈ టీజర్లో కమెడియన్ సత్య అందరినీ నవ్వించేశాడు. కింగ్ నాగ్ గెటప్ కూడా చాలా కొత్తగా ఉంది. అంతేకాదు..ఈ సీజన్8 షో స్పెషాలిటీ గురించి నాగ్ చెప్పేసాడు. 'అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్..ఒక్కసారి కమిట్ అయితే


 ఇక్కడ అన్ లిమిటెడ్..లిమిటే లేదు' అని నాగ్ చెప్పుకొచ్చాడు. అంటే ఈసారి లిమిటే లేకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నాగ్ ఆడియన్స్ కు హామీ ఇచ్చేశాడు. దొంగైన కమెడియన్ సత్య ఓ షాప్ లూటీ చేయడానికి వెళతాడు. అక్కడ ఉన్న అద్భుత దీపాన్ని తాకుతాడు. అందులోనుండి జీనీ రోపంలో నాగార్జున వస్తాడు. నీకు కావాల్సింది ఏదైనా కోరుకో..అన్ లిమిటెడ్ గా ఇస్తాను అని సత్యతో నాగార్జున అంటాడు. ఈ అన్ లిమిటెడ్ అనే పదంలోనే అసలు మతలబు ఉంది. బిగ్ బాస్ 8లోగో లో ఎనిమిదిని ఇన్ఫినిట్ వలె డిజైన్ చేశారు. అలా బిగ్బాస్ 8 కి సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: