విక్రమ్ మాట్లాడుతూ 'ఇప్పటిదాకా ఏ సినిమాకు ఇంత కష్టం పడలేదు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మరో ప్రపంచం లోకి వెళ్తారు’’ అని అన్నారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఇది రూపొందింది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిరహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఓ భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో రేపు సాయంత్రం 6:00గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర హీరో చియాన్ విక్రమ్, దర్శకుడు పా. రంజిత్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. భారీ అంచనాల మధ్య కేజీఎఫ్ గోల్డ్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని రూ. 100 కోట్లతోగ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించగా, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను మైత్రీ మూవీస్ కొనుగోలు చేసింది.ఆగస్ట్ 15న విడుదల కానున్న సంగతి తెలిసిందే.తంగలాన్ మూవీలో విక్రమ్ తోపాటు మాళవికా మోహనన్, పశుపతి, పార్వతి తిరువోతులాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన విక్రమ్ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయేలా ఉంది. ఇందులో అతడు అసలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. కేజీఎఫ్ అసలు కథను ఈ సినిమా ద్వారా ప్రపంచం ముందుకు తీసుకురానున్నట్లు గతంలో మేకర్స్ వెల్లడించారు.