ఈ వీకెండ్ తెలుగు OTT ప్లాట్‌ఫామ్స్‌లో అదిరిపోయే తెలుగు వెబ్‌సిరీస్, సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో 5 సినిమాలు, ఒక వెబ్ సిరీస్, అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక డాక్యుమెంటరీ ఉన్నాయి. మన ఇంట్లోనే కూర్చొని ఈ కొత్త సినిమాలు, సిరీస్‌లు చూడొచ్చు. ఈ కొత్త విడుదలల గురించి అన్ని వివరాలు, వీటిని ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎప్పుడు చూడవచ్చో కింద తెలుసుకుందాం.
* మోడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి గురించి ఒక కొత్త డాక్యుమెంటరీ "మోడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి" నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 2న విడుదలయ్యింది. ఈ డాక్యుమెంటరీకి ఆల్రెడీ చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. ఇందులో రాజమౌళి జీవితాన్ని మూడు భాగాలుగా చూపించారు. అతని చైల్డ్ హుడ్, సినిమా రంగంలోకి ఎలా అడుగు పెట్టాడు, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ లాంటి సినిమాలతో ఎలా ప్రపంచ ప్రజల మనసు దోచుకున్నాడు అనే విషయాలన్నీ చాలా బాగా చూపించారు.
* బృంద
త్రిష కృష్ణన్ నటించిన ‘బృంద’ అనే కొత్త వెబ్ సిరీస్ ఆగస్టు 2న సోనీలివ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్‌తో త్రిష డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ చాలా మందిని ఆకట్టుకుంది.
* డ్యూన్: పార్ట్ టు
డ్యూన్: పార్ట్ 2 సినిమా ఇప్పుడు జియో సినిమాలో తెలుగులో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో పాల్ అట్రైడీస్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని నాశనం చేసిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతను చని అనే అమ్మాయితో కలిసి పనిచేస్తాడు. తన ప్రియురాలిని కాపాడాలా లేక ప్రపంచాన్ని కాపాడాలా అనే గందరగోళంలో పడతాడు.
* సత్యభామ
కాజల్ అగర్వాల్ నటించిన ‘సత్యభామ’ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో కాజల్ ఒక పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుంది. తన పనిని ఎంతగా ప్రేమిస్తుందో అంటే, తన పెళ్లికి కూడా లేటుగా వస్తుంది. ఒక రోజు హసీనా అనే స్త్రీ తన భర్త వేధింపుల నుంచి తప్పించుకోవడానికి సత్యభామ దగ్గరకు వస్తుంది. కానీ సత్యభామ హసీనాను కాపాడలేకపోతుంది. దీంతో సత్యభామ ఆమె భర్త యేదుని పట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది. సత్యభామ ఎలా యేదుని పట్టుకుంది? హసీనా తమ్ముడు ఇక్బాల్ ఈ కథలో ఎలాంటి పాత్ర పోషించాడు? అనేది మిగతా కథ.
* తెప్ప సముద్రం
చైతన్య రావు & సాయి కుమార్ నటించిన తెప్ప సముద్రం ఆగస్టు 03, శనివారం నుంచి ఆహా వీడియోలో అందుబాటులో ఉంది.
* రక్షణ
పాయల్ రాజ్‌పుత్ నటించిన ‘రక్షణ’ సినిమా ఇప్పుడు ఆహా వీడియోలో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ ఒక పోలీస్ అధికారిణిగా నటిస్తుంది. ఆమె మంచి స్నేహితురాలు ప్రియ ఆత్మహత్య చేసుకుంటుంది. కానీ కిరణ్ ప్రకారం అది హత్య. ఈ కేసును అన్వేషిస్తూ ఆమె అరుణ్ అనే వ్యక్తిని కలుస్తుంది. అతను ఒక వేధింపు కేసులో ఇరుక్కుంటాడు. అరుణ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత కిరణ్ అతని మరణం వెనుక మరో కుట్ర ఉందని అనుమానిస్తుంది.
* డియర్ నాన్న
చైతన్య రావు నటించిన ‘డియర్ నాన్న’ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా కథ కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లో జరుగుతుంది. సూర్య అనే యువకుడు కుక్‌గా కావాలని కలలు కంటాడు. కానీ అతని నాన్న మాత్రం అతను తన మందుల దుకాణం చూసుకోవాలని కోరుకుంటాడు. తన నాన్నకు కరోనా వచ్చినప్పుడు, తన కలలను వదులుకొని తన నాన్న దుకాణం చూసుకోవడానికి బలవంతంగా సూర్య ఎలా ప్రయత్నించాడో ఈ సినిమా చూపిస్తుంది.