ఈ సినిమా హిట్ కాకపోయినా మంజరీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఏకంగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ శక్తి సినిమాలో కనిపించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఈ భామకు సరైన అవకాశాలు రాలేదు.. దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది. మంజరి అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుని బిజీ హీరోయిన్గా మారిపోయింది. వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. ఇటీవల చల్తీ రహే జిందగీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంజరి తన లేటెస్ట్ ఫోటోలు అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా ఆమె గ్లామర్ ఫోటోలు చూస్తుంటే కుర్రాళ్లకు మంచికి కిక్ వస్తుంది. ఏ వయసులోనూ మంజరి ఫోటోలు చూస్తుంటే కన్నార్పలేని పరిస్థితి. ఈ హాట్ ఫొటో షూట్ ల తర్వాత అయినా టాలీవుడ్ లో సీనియర్ హీరోలు మంజరి కి తమ సినిమా లలో అవకాశాలు ఇస్తారేమో చూడాలి.