తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో గోపీచంద్ ఒకరు. ఈయన కెరియర్ను హీరో గానే మొదలు పెట్టినప్పటికి ఈయన నటించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది. దానితో గోపీచంద్ కు ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలు రాలేదు. అలాంటి సమయంలో తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన జయం మూవీలో విలన్ అవకాశం వచ్చింది. ఇక ఏదో ఒకటి టాలెంట్ నిరూపించుకోవాలి అనే ఉద్దేశంతో గోపీచంద్ ఆ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడం , అందులో గోపీచంద్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కడంతో వరుసగా ఈయనకు సినిమాల్లో విలన్ పాత్రలు దక్కాయి.

అందులో భాగంగా గోపీచంద్ వరుసగా వర్షం , నిజం సినిమాలలో విలన్ పాత్రలో నటించాడు. వాటికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. కానీ ఆయన విలన్ గా కాకుండా హీరోగా చేయాలి అని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా యజ్ఞం సినిమాలో నటించగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక అప్పటి నుండి ఈయన విలన్ పాత్రల సైడ్ వెళ్లకుండా కేవలం హీరో గానే నటిస్తూ వస్తున్నాడు. ఇకపోతే గోపీచంద్ తన కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. కానీ ఆయనకు అనుష్కతో నటించిన లక్ష్యం , శౌర్యం రెండు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

అలాగే గోపీచంద్ , అనుష్క ఇద్దరు హైట్ , పర్సనాలిటీ అద్భుతంగా ఉండడంతో స్క్రీన్ పై వీరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక వీరి ఇద్దరి కాంబోలో రూపొందిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించడంతో వీరిద్దరి కాంబోలో మరిన్ని మూవీలు వస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత వీరు కాంబోలో సినిమాలు రాకపోవడానికి ప్రధాన కారణం ఈ రెండు మూవీల తర్వాత అనుష్క వైవిద్యమైన పాత్రల వైపు ఇంట్రెస్ట్ చూపడం , అలాగే గోపీచంద్ కూడా కొత్త రకం సినిమాలు చేస్తూ వెళ్లడంతో వీరి కాంబోలో సినిమా రాలేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc