ఇటీవల జరిగిన ఎన్నికలలో రోజా నగరి నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ నాయుడు చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఐదేళ్లపాటు ఆమెకు రాజకీయంగా ఎలాంటి పని దొరకదు. ఈ క్రమంలోనే చెన్నైలో నివాసం ఉంటున్న రోజా వచ్చే ఐదేళ్లు ఖాళీగా ఉండలేమన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజా ఉపాధి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తనకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ లో రీయంట్రీ ఇచ్చి మళ్లీ జడ్జిగా బిజీ అవ్వాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆమెపై సినిమా రంగంతో పాటు ఇటు బుల్లితెర రంగంతో పాటు పొలిటికల్గా నెగిటివ్ ఎక్కువగా క్రియేట్ అయింది.
ఇది ఈ సారి షో రేటింగ్ లపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అయితే మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వాళ్లు రోజని తిరిగి జబర్దస్త్ లోకి తీసుకునేందుకు అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజా భర్త కనీసం బుల్లితెర మీదకు అయినా తన భార్యను తీసుకువెళ్లి అక్కడ ఎంట్రీ చేయించాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం.