ఒకసారి గా భారీ వర్షాలు అలాగే కొండ చరియలు విరగడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక ఆ జిల్లాలో ఇంకా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు అందిస్తున్నారు చాలామంది ప్రముఖులు. ఇప్పటికే తమిళ్ ఆ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ప్రముఖ నటీనటులు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఇలాంటి నేపథ్యంలోనే టాలీవుడ్ అగ్ర హీరో, ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక ప్రకటన చేశారు. వయనాడు బాధితుల కోసం అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇందులో భాగంగానే వయనాడు బాధితుల కోసం 25 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు అల్లు అర్జున్. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద నోట్ రాసుకోచ్చారు.
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మారణకాండ... విషాదకరమన్నారు. కేరళ అంటే తనకు ఎంతో ఇష్టమని... అలాంటి రాష్ట్రంలో ఇలా జరగడం దారుణం అన్నారు. అందుకే వయనాడు బాధితుల కోసం ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నారు తెలిపారు. బాధితులను... ప్రభుత్వం దగ్గరుండి కాపాడాలని కోరారు. మరణించిన వారికి నివాళులు కూడా అర్పించారు అల్లు అర్జున్. కాకా మలయాళ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక అటు కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మారణకాండ నేపథ్యంలో సూర్య, రష్మిక, కార్తి లాంటి వారు కూడా సాయం చేశారు.