ఇప్పటివరకు ఇచ్చిన అపడేట్స్ తోనే మేకర్స్ పిచ్చెక్కించడంతో..ఈ చిత్రంపై ఆడియన్స్ హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ పార్ట్ 1 సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే..'దేవర' చిత్రం తెలుగు తెరకు పరిచయమవుతున్న జాన్వి కపూర్..ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గ్రేస్ సొంతం చేసుకోవాలని చేస్తుంది. కానీ..'దేవర' రిలీజ్ కు ముందు జాన్వికి గట్టి షాక్ తగిలినట్లు అయింది.
అదేంటంటే..జాన్వి కపూర్ తాజాగా నటించిన చిత్రం 'ఉలరు' ఈ చిత్రం రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ బాగా చేసింది. ఇందులో 'దేవర' గురించి కూడా బాగానే ప్రమోట్ చేసింది ఈ బ్యూటీ. అయితే..ఆ మూవీ ఆగస్టు 2న రిలీజ్ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఈ నెగటివిటి ఇప్పుడు 'దేవర' పై పడుతుందేమో అని భయపడుతున్నారు జాన్వి ఫ్యాన్స్. కాగా..ఈ సినిమాతో పాటు తెలుగులో రామ్ చరణ్ తో మరో మూవీకి చూస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. రామ్ చరణ్ మూవీలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆ మూవీ టైటిల్ ఇంకా రిలీజ్ చేయలేదు.