హీరో రన్బీర్ కపూర్ అండ్ సాయి పల్లవి నటిస్తున్న తాజా మూవీ రామాయణం . తాజాగా ఈ మూవీ పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . పురాణాల ఆధారంగా మూవీస్ చేయడం అంత ఈజీ కాదని ఆయన పేర్కొన్నారు . ఆర్జీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి . సీనియర్ నటుడు ఎన్టీ రామారావు ఉన్న కాలంలో వీటిని చాలా మంది చూసే వాళ్లు కానీ .. ఇప్పుడు మొత్తం మారిపోయింది . ఏదైనా దేవుడి సినిమాలు వస్తే భక్తితో చూస్తున్నారు తప్ప చూడాలని ఎవరు ఇంట్రెస్ట్ చూపడం లేదు .


ఇక్కడ ఇంకోటి మాట్లాడుకోవాల్సిన విషయం .. భక్తి సినిమాలో కొంచెం తప్పుగా అనిపించినా మత పెద్దలు విమర్శించే అవకాశం లేకపోలేదు . కాబట్టి నేను అలాంటి సినిమాలు ఎప్పటికీ చెయ్యను . సినిమా తీసాక హిట్ అవుతుందా .. ఫ్లాప్ అవుతుందా అనేది పక్కన పెడితే .. లేనిపోని పంచాయితీలు ఎక్కువవుతాయి . దీని కారణంగా విభేదాలు అండ్ విమర్శలు తప్ప లాభం ఏమీ లేదు . ఆది పురుష్ మూవీ విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే . ఇలాంటి మూవీస్ చాలా డేంజర్ .


రామాయణం లాంటి సినిమా చేసేందుకు ధైర్యం చేస్తున్నారంటే మామూలు విషయం కాదు . వారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను .. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు ఆర్జీవి . ప్రెసెంట్ రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకునే ఆర్జీవి ఒక్కసారిగా .. వివాదాల గురించి మాట్లాడడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు కూడా . ఏదేమైనప్పటికీ మొట్టమొదటిసారి హాజీవి మంచి మాటలు మాట్లాడాడు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: