ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌కు నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో అజయ్ దేవగన్, టబు కలిసి 10 సినిమాలు నటించినట్లు అయింది. రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ఆగస్టు 2వ తేదీన తెరకెక్కింది. రెండు రోజులు పూర్తవుతున్నా ఈ మూవీ ఐదు కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఒక వారంలోగా ఇది 15 కోట్లు కలెక్ట్ చేస్తే గగనమే. మొత్తం మీద 20 కోట్లు అంటే ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమా చేయకపోవచ్చు అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఈ మూవీ ఎగ్జిక్యూషన్ అసలు బాగోలేదు కథ చాలా స్లోగా సాగింది. స్టోరీ కూడా బోరింగ్ గా ఉంది అన్ని సన్నివేశాలు ముందుగానే ఊహించే లాగా ఉన్నాయి. ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడి సహనానికి అతి పెద్ద పరీక్ష లాగా అనిపిస్తుంది. ఇంత చెత్త సినిమా చేయడానికి అజయ్ ఎందుకు ఒప్పుకున్నాడు అతనికే తెలియాలి.
ఇందులో 2000-2024 ఏళ్ల మధ్య జరిగిన ఒక లవ్ స్టోరీ చూపించారు. కృష్ణ (అజయ్ దేవగన్) వసుధ (టబు) లు చిన్నప్పుడు ప్రేమించుకుంటారు. కొన్ని గొడవల్లో కృష్ణ కొన్ని హత్యలు చేసే ఎంజాయ్ ఫాలో అవుతాడు. వసుధ చేసేదేమీ లేక అభిజీత్ (జిమ్మీ షెర్గిల్) అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటుంది. అయితే జైలు శిక్షణ అనుభవించిన తర్వాత కృష్ణ వసుధని మీట్ కావాలనుకుంటాడు తర్వాత ఏమైంది అనేది ఈ సినిమా కథ. ఈ కథను బాగా చెప్పి ఉంటే హిట్ అయ్యేదేమో కానీ దర్శకుడు ఆ విషయంలో ఫెయిలయ్యాడు.