ఈ చిత్రంలో తనను తీసుకున్నందుకు నిర్మాత శివకుమార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ తన తొలి చిత్రంలోని ఇలాంటి మాస్ పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది అంటు తెలిపింది. ఈ చిత్రంలో హీరోయిన్ బాలయ్య అభిమానిగా కనిపించడం చాలా అరుదుగా అనిపించింది అంటూ తెలిపింది మాల్వి మల్హోత్రా. దీంతో బాలయ్య ఫ్యాన్స్ తమ హీరో పేరు వినిపించిందంటే ఆ సినిమా సక్సెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇలాంటి పాత్ర తనకు ఇచ్చినందుకు టీం మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. అలాగే టీమ్ లో అందరూ కూడా తనకి బాగా సపోర్ట్ చేశారని ఇలా తనకు మరెన్నో తెలుగు సినిమాలలో నటించే అవకాశాలు కల్పించాలని కోరుకుంటుంది హీరోయిన్ మాల్వి మల్హోత్రా.
తమ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని.. థియేటర్లకు వస్తున్నారని.. దీనిని చూసి థియేటర్లు కూడా పెంచారని డైరెక్టర్లు చెప్పడంతో తమకు ఆనందం కలుగుతుందని తెలిపింది.. ఈ సినిమా పైన ఎంతోమంది కుటుంబాలు సైతం ఆధారపడి ఉంటున్నాయని రివ్యూలు ఇచ్చేవారు కాస్త ఆలోచించి జాగ్రత్తగా ఇవ్వాలి అంటే సూచిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక మరొక నటి మన్నార చోప్రా మాట్లాడుతూ.. ఇటీవలే ఓటీటి లో కూడా రన్నర్ గా నిలిచిన తనను ఆదరించిన ప్రతి ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు అంటూ తెలిపింది. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో అయినప్పటికీ కూడా తాను నటించాలని కోరికతోనే ఇలా సినిమాలలో నటించానని తెలిపింది. తనకు కూడా ఆనందంగా ఉందని తెలిపింది.