హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమా అటు పూరి కెరీర్ను రామ్ కెరియర్ను మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా అయింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి  తాజాగా ట్రైలర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ తో మరొకసారి ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకునేలా కనిపిస్తోంది.


అందరి అంచనాలను రెట్టింపు చేస్తు డబుల్ ఇస్మార్ట్ టైలర్ చాలా ఎక్సైటింగ్ గా ఎనర్జీగా కనిపిస్తోంది. ట్రైలర్ అధ్యంతం పూర్తిగా పూరి మార్క్ మరొకసారి చూపించారని కూడా చెప్పవచ్చు.. అలాగే రామ్ మొదటి భాగం కంటే మరింత ఎనర్జీతో ఈ సినిమాలో నటించినట్లుగా ఈ ట్రైలర్ ని చూస్తే మనకి కనిపిస్తోంది. అలాగే విలన్ గా కూడా సంజయ్ దత్ మరొక సారి ఈ సినిమాలో ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. ట్రైలర్లో మరొకసారి రామ్ తన డైలాగుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.మరొకసారి తన మాస్ స్టెప్పులతో  అదరగొట్టేసారని కూడా చెప్పవచ్చు.

కీలకమైన పాత్రలో సియాజి షిండే  నటిస్తూ ఉన్నారు. నభా నటేశాను రీప్లేస్ చేసేలా కావ్య దాపర్ తన అందాలతో మరింత ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో ఉన్న ఎనర్జీ మరి సినిమా తో థియేటర్లో ఏ విధంగా అభిమానులను మెప్పించేలా చేస్తుందో తెలియాలి అంటే ఆగస్టు 15వ తేదీ వరకు ఆగాల్సిందే.. పూరి కనెక్ట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. నిధి అగర్వాల్ కూడా ఇందులో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ మాత్రం అభిమానులకు ఫుల్ కిక్కించేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: