అందాల ముద్దు గుమ్మ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సమంత ఇప్పటి వరకు ఎన్నో తెలుగు మరియు తమిళ సినిమాలలో నటించి రెండు ఇండస్ట్రీ లలో కూడా అద్భుతమైన విజయాలను అందుకొని ఎంతో గొప్ప స్థాయికి ఎదిగింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ తో కూడా పలు సినిమాలలో నటించింది. వీరిద్దరి కాంబోలో మొదటగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన తేరి అనే మూవీ వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది.

సినిమా తర్వాత విజయ్ హీరోగా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన కత్తి అనే సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మరోసారి అట్లీ , విజయ్ తో రూపొందించిన మెర్సల్ మూవీ లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. ఇలా విజయ్ , సమంత కాంబోలో రూపొందిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈ హిట్ కాంబోలో మరో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

విజయ్ ప్రస్తుతం గోట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత విజయ్ ఒక మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ తోనే ఆయన సినిమాలను ఆపేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈయన రాజకీయాల వైపే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే విజయ్ హీరోగా రూపొందబోయే ఆఖరి సినిమాలో సమంత ను హీరోయిన్ గా తీసుకోవాలి అని మూవీ బృందం ఇప్పటికే డిసైడ్ అయినట్లు , అందులో భాగంగా ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు , ఆమె కూడా విజయ్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: